AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కూలీ ట్రైలర్ డేట్ లాక్..! ఎప్పుడంటే..?

‘మా నగరం’ అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత ‘ఖైదీ’ సినిమాతో సంచలనం సృష్టించారు లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj). విజయ్ దళపతి (Vijay Thalapathi) తో ‘లియో’ సినిమా చేశారు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం రజనీకాంత్ (Rajinikanth ) తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు శృతిహాసన్ (Shruti Haasan), నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూలీ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు డైరెక్టర్ లోకేష్ కనగరాజు.

కూలీ ట్రైలర్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

లోకేష్ కనగరాజు కూలీ సినిమా గురించి మాట్లాడుతూ.. “కమర్షియల్ సినిమా అయినప్పటికీ కూడా ఇందులో ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే రజినీకాంత్ యాక్షన్ పర్ఫామెన్స్ ను మీరు చూసి తట్టుకోలేరు. ఇక ట్రైలర్ విడుదల అయ్యే వరకు కూడా ఇందులో నటించిన హీరోల లుక్స్ ను రివీల్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఒక ట్రైలర్ తోనే ప్రమోషన్స్ చాలు అని అనుకుంటున్నాను. ఇక ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్టు 2వ తేదీన రిలీజ్ చేస్తాము”. అంటూ ట్రైలర్ రిలీజ్ పై కామెంట్లు చేస్తూనే మరొకవైపు నటీనటుల లుక్స్ గురించి కూడా చెప్పుకొచ్చారు లోకేష్ కనగరాజు.

నాగార్జున కెరీర్ లో ఇదో మైల్ స్టోన్ – లోకేష్ కనగరాజు

ఇకపోతే నాగార్జున ఈ సినిమాలో నటించడం పై కూడా లోకేష్ మాట్లాడుతూ..” ఇందులో నాగార్జునను ఒప్పించడానికి నాకు చాలా సమయం పట్టింది. నాగార్జున కెరీర్ లో ఇప్పటి వరకు నటించని పాత్రను ఆయన ఈ సినిమాలో పోషించారు. తప్పకుండా ఈ సినిమా ఆయన కెరీర్ కు మైల్ స్టోన్ గా నిలుస్తుంది” అంటూ లోకేష్ తెలిపారు.

 

ఇక అలాగే ఈ సినిమాలో మొదట ఫహద్ ఫాసిల్ ను ఒక పాత్ర కోసం అనుకున్నారట. కానీ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమాకు డేట్స్ కేటాయించలేకపోయారని.. అందుకే ఆ పాత్ర కోసం సౌబిన్ షాహిర్ ను ఎంపిక చేశాను అని డైరెక్టర్ తెలిపారు. ఇక అలాగే కూలీ విడుదల తర్వాత కార్తీ హీరోగా ఖైదీ సీక్వెల్ గా ఖైదీ 2 ని తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. ఇది పూర్తయ్యాక అమీర్ ఖాన్ తో ఒక సినిమా రూపొందించే అవకాశం ఉందని , అటు సూర్యతో రోలెక్స్ మూవీ చేస్తానని తెలిపారు. వీటితోపాటు కమలహాసన్ తో విక్రమ్ 2, విజయ్ తో మాస్టర్ 2అలాగే లియో 2 కూడా చేయాలని ఉందని, ఆయా హీరోలు ఒప్పుకుంటే.. డేట్స్ ఇస్తే.. పూర్తి చేస్తానని కూడా తెలిపారు లోకేష్

ANN TOP 10