మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటన విడుదల చేశారు. ఏపీకి చెందిన అశోక్ గజపతిరాజుకి కూడా గవర్నర్ పదవిని ఇచ్చారు. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్, గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తాలను నియమిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అయిన అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కడంపై పార్టీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
