కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాయి కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోని ఉన్న టాలెంటెడ్ నటులలో ప్రకాష్ రాజు ఒకరు. ఎన్నో సినిమాలతో అద్భుతమైన గుర్తింపు సాధించుకున్నారు ప్రకాష్ రాజు. కేవలం సినిమాలోనే మాత్రమే కాకుండా బయట కూడా జస్ట్ ఆస్కింగ్ పేరుతో కొన్ని ప్రశ్నలు సందిస్తూ విలక్షణంగా ఉంటారు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దిగ్గజ నటులు కోటా శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. దీనితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ శోక సముద్రంలో మునిగిపోయింది. పలువురు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు ఆయన మృతదేహానికి నివాళులర్పిస్తూ, ఆయనతో ఉన్న జ్ఞాపకాలను మీడియా ఎదురుగా పంచుకుంటున్నారు.
కోటా అందరికీ నచ్చరు
కోటా శ్రీనివాసరావు గారిది నాలుగు దశాబ్దాల సినిమా ప్రయాణం. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరులో ఉన్నప్పుడే ఆయన సినిమాలు చూసేవాన్ని. ఆయన తీక్షణత, ఆయన ఇంటెన్సిటీ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆ తర్వాత వచ్చి రెండు మూడు దశాబ్దాలుగా ఆయనతో పని చేసిన అనుభవం ఉంది నాకు. ఎన్నో సినిమాలు ఆయనతో చేశా, చాలా విశిష్టమైన వ్యక్తి. అందరికీ నచ్చరు, ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన. అద్భుతమైన నటుడు, ఆయనకంటూ ఒక అవగాహన ఉంది. ఆయనకంటూ ఒక సెటైర్ ఉండేది. పరిశ్రమలో చాలామంది నటులను చూస్తాం. కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే అలాగే చెప్పడం కాదు. దాని వెనక ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది.
తెలుగు నటులకు అవకాశం లేదు
ఆయన కొన్నిసార్లు మాట్లాడుతూ తెలుగు నటులకు అవకాశం దొరకట్లేదు అంటూ ఉండేవాళ్ళు. కొందరికి అది కుళ్ళు అనిపించేది. కానీ ఆయన ఆవేదన చాలా నిజమైనది అని నాకనిపించేది. ఒకసారి ఎవరో ఆయనను అడిగారు. ప్రకాష్ రాజు పరభాష నటుడు కదా అని. కాదండి ఆయన తెలుగు నేర్చుకున్నారు కదా మనవాడు అయిపోయాడు కదా. భాషను తక్కువగా పలకరిస్తే ఆయన తట్టుకునే వాళ్ళు కాదు. ఆయన నామీద కూడా సెటైర్లు వేసేవాళ్ళు. నేను కూడా హ్యాపీగా దాన్ని తీసుకునేవాన్ని. నేను ఒకరోజు ప్రొడక్షన్ కారు పంపించి షూటింగ్ కు రమ్మంటే వచ్చారు. అందరితో చాలా హ్యాపీగా మాట్లాడారు. ఒక రెండు మూడు సార్లు నాకు అవసరం ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు.