ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన న్యూస్ ఆఫీసుపై దాడి కేసులో ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కవిత ప్రోద్బలంతో ఆమె అనుచరులు, కార్యకర్తలు తన కార్యాలయంపై దాడి చేసారని ఫిర్యాదు చేశారు. తనకు రక్షణగా ఉన్న గన్‌మెన్స్‌పై దాడిచేసి వారి వద్ద తుపాకిని బలవంతంగా లాక్కొని తనను చంపడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. బీసీ ఉద్యమ నాయకులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో ప్రస్తావించారు మల్లన్న.
