హనుమాన్ జయంతి సందర్భంగా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా ర్యాలీలు, కర్మన్‌ఘాట్ నుంచి గౌలిగూడ మీదుగా సికింద్రాబాద్ తాడ్‌బంద్ హనుమాన్ ఆలయం వరకు భారీ ర్యాలీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ఉండేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలు సీవీ ఆనంద్, డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంధ్ర ఇప్పటికే ఆయా కమిషనరేట్ల పరిధిలో నిర్వహించే ర్యాలీలకు సంబంధించిన సమాచారం, ఆయా విభాగాలతో సమన్వయ సమావేశాలు, సిబ్బందితో పలుమార్లు సమావేశాలు నిర్వహించి బందోబస్తుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు. ర్యాలీలు జరిగే అన్ని రూట్లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు.