AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రంలో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాల‌యాల సొసైటీ ప‌రిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం చ‌ర్యలు చేప‌ట్టింది. తొలిద‌ఫాలో వివిధ కేట‌గిరీల్లో మొత్తంగా 9,231 పోస్లుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు తెలంగాణ గురుకుల విద్యాల‌యాల సంస్థ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్‌) క‌న్వీన‌ర్ నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఆయా పోస్టుల భ‌ర్తీకి సంబంధించి 12వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నుంది.

మొత్తం పోస్టులు 13వేల‌కు పైగానే..
తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. క్రమంగా విస్తరించుకుంటూ పోతున్నది. రాష్ర్ట ఏర్పాటు నాటికి 123 గురుకుల పాఠ‌శాల‌లు ఉండ‌గా, వాటిని 1011ల‌కు పెంచింది. అంతేగాకుండా వాటిని క్రమంగా పాఠ‌శాల స్థాయి నుంచి ఇంట‌ర్‌, డిగ్రీ స్థాయికి విస్తరించుకుంటూ పోతున్నది. ఈ క్రమంలో ఆయా గురుకులాల్లో శాశ్వత ప్రతిపాదికన పోస్టుల భర్తీని క్రమంగా చేప‌డుతున్నది. మూడేళ్ల క్రిత‌మే ఆయా గురుకులాల్లో 10వేల పోస్టుల భ‌ర్తీకి చ‌ర్యలు చేప‌ట్టగా, తాజాగా అంతేకు మించి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. మొత్తంగా ప్రభుత్వం తొలుత 9096పోస్టులను ఖాళీలుగా గుర్తించింది. అటు త‌రువాత మ‌రో 33 బీసీ గురుకులాలు, 15డిగ్రీ క‌ళాశాల‌ల మంజూరు చేయ‌గా అందుకు సంబంధించిన పోస్టుల‌ను కూడా భ‌ర్తీ చేయాల‌ని నిర్ణయించింది. దీంతో మ‌రో 3వేల పోస్టుల‌ను ప్రభుత్వం మంజూరు చేయ‌గా, మొత్తంగా బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందికి సంబంధించి 13,530 పోస్టుల‌ను ఖాళీలుగా గుర్తించ‌డంతోపాటు అందుకు ప్రభుత్వం అమ‌నుతి సైతం మంజూరు చేసింది. తాజాగా వాటి భ‌ర్తీకి ట్రిబ్ చర్యలు చేప‌ట్టింది.

వారంలో మ‌రో వెయ్యి పోస్టులకు నోటిఫికేష‌న్‌..
మొత్తంగా 13,675 పోస్టుల్లో గ్రూప్‌3, గ్రూప్ 4 పోస్టుల మిన‌హా మిగ‌తా 10,675 పోస్టుల భ‌ర్తీని ట్రిబ్ ద్వారా చేప‌ట్టనున్నారు. అందులో తొలిద‌ఫాగా ప్రస్తుతం 9231 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. మిగ‌తా పోస్టులకు సంబంధించి అందులో కొన్ని కొత్తగా, మెస్ ఇన్‌చార్జి, మ‌రికొన్ని పోస్టుల‌కు స‌ర్వీస్ రూల్స్‌ను రూపొందించాల్సి ఉంది. అదికాకుండా కొన్ని న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఉన్నాయి. వాట‌న్నింటినీ ప‌రిష్కరించి మ‌రో వారం రోజుల్లో మిగిలిన పోస్టుల భ‌ర్తీకి సైతం నోటిఫికేష‌న్ జారీ చేసేందుకు చర్యలు చేప‌ట్టింది. ఇక గురుకులాల‌కు మంజూరైన ఏఎన్ఎం, స్టాఫ్ న‌ర్స్ పోస్టుల‌ను మెడిక‌ల్ బోర్డు చేప‌ట్టనుంది. ఆ నేప‌థ్యంలో ఎలాంటి వివాదాలు లేని పోస్టుల భ‌ర్తీ ప్రక్రియను చేప‌ట్టింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10