AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జగన్ కారును తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు..

వైసీపీ అధినేత జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి ఈ తనిఖీ చేపట్టారు. ఏపీ 40 డీహెచ్ 2349 రిజిస్ట్రేషన్ నంబరు గల ఈ కారును ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు.

 

వివరాల్లోకి వెళితే, ఇటీవల జగన్ రెంటపాళ్లలో పర్యటించినప్పుడు సింగయ్య అనే వ్యక్తి జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఈ ఘటనపై తీవ్ర కలకలం రేగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ (ఎంవీఐ) గంగాధర ప్రసాద్ నేతృత్వంలోని బృందం కారు సాంకేతిక పరిస్థితిని, ఫిట్‌నెస్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. తనిఖీ అనంతరం వాహనాన్ని తదుపరి విచారణ నిమిత్తం పోలీసుల ఆధీనంలోనే ఉంచారు.

 

ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్‌రెడ్డిలను నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే.

ANN TOP 10