ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ, ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కష్ణారావు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి నివాసాన్ని సందర్శించారు. పర్యటనలో భాగంగా తలమడుగు మండలంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కంది శ్రీనివాస రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన స్వస్థలం తాంసి మండలం హస్నాపూర్ గ్రామంలోని ఆయన నివాసాన్ని సందర్శించారు. కంది శ్రీనివాస రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు గ్రామస్తులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు.తేనీటి విందు ను స్వీకరించారు.
