AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సింగయ్య మృతి కేసులో జగన్ కు నోటీసులు..

ఇటీవల వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగానే పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చి వైసీపీ అధినేత జగన్ ను కూడా నిందితుడిగా చేర్చారు.

 

ఈ కేసులో జగన్ ను ఏ2గా పేర్కొన్న పోలీసులు… తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు నోటీసులతో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యలయానికి వెళ్లారు. అక్కడ వైసీపీ కార్యాలయ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అంతేకాదు, సింగయ్య మృతికి కారణమైనదిగా భావిస్తున్న ఫార్చ్యూనర్ (AP 40 DH 2349) వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ANN TOP 10