జనగామలో ఎస్ఐ దంపతుల మృతి..
తెలంగాణలోని జనగామ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జనగామ ఎస్ఐ కాసార్ల శ్రీనివాస్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ దంపతుల మృతి స్థానికంగా కలకలం రేపింది. భార్య స్వరూప.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలుసుకుని ఎస్సై కాసార్ల శ్రీనివాస్ గదిలోకి వెళ్లి గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.