గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో వ్యక్తిగతంగా సమావేశమయ్యేందుకు అవకాశం కోరారు. కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నందున, వ్యక్తిగతంగా కలిసేందుకు సమయం ఇవ్వాలని రాజాసింగ్ మంగళవారం విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్కడ, ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియజేస్తే, తాను అక్కడికే వచ్చి కలుస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరూ సమష్టిగా పనిచేస్తేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.