AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌..!

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌.. ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌ రావు కూడా విచారణకు హాజరయ్యారు. అంతకుముందు నందీనగర్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ అయిన విష‌యం తెలిసిందే.

 

ఈ స‌మావేశంలో ఫార్ములా వన్‌ విచారణకు సంబంధించి పలు అంశాలపై వారు చర్చించినట్లు స‌మాచారం. ఈ భేటీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు కూడా పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనాయకులతో స‌మావేశ‌మ‌య్యారు. అనంతరం తెలంగాణ భవన్‌ నుంచి నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలనికి చేరుకున్నారు.

 

అంత‌కుముందు కేటీఆర్ మాట్లాడుతూ… ‘‘విచారణకు రమ్మని ఇప్పటికే మూడుసార్లు పిలిచారు.. ఇంకో 30 సార్లు పిలిచానా వస్తా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్లా.. ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను’’ అంటూ వ్యాఖ్యానించారు.

ANN TOP 10