AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరో వివాదంలో సినీ నటి కల్పిక కేసు నమోదు..

హైదరాబాద్​లోని ప్రిజం క్లబ్​ వ్యవహారంలో సినీ నటి కల్పికపై ఇటీవల కేసు నమోదు కగా, ఇపుడు కల్పికపై మరో కేసు కూడా నమోదు అయింది. ఇన్‌స్టా వేదికగా అసభ్య పదజాలంతో కల్పిక తనని దూషించిందని పేర్కొంటూ కీర్తన అనే బాధితురాలు తాజాగా హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఆన్‌లైన్‌ వేదికగా నటి వేధింపులకు పాల్పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలను పోలీసులకు అందించారు. బాధితురాలి కంప్లైంట్ మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నటి కల్పికపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​లో కేసు నమైదైంది. ఇటీవల ప్రిజం క్లబ్​కు వెళ్లినప్పుడు ఆమె హంగామా సృష్టించిందని, క్లబ్​ మేనేజర్​ ఇతర సిబ్బందిపై అత్యాచారం, అసభ్య ప్రవర్తన ఆరోపణలు చేస్తూ సోషల్​ మీడియాలో ప్రచారం చేసిందని క్లబ్​ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఎదుట కూడా కల్పిక అసత్యమైన ఆరోపణలు చేసిందని క్లబ్​ ఆస్తిని ధ్వంసం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ANN TOP 10