AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అహ్మదాబాద్లో ఘోరం.. కుప్పకూలిన విమానం..

అహ్మదాబాద్లో ఘోరం

– కుప్పకూలిన విమానం

– విమానంలో 242 మంది ప్రయాణికులు

 

మహా

గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఎయిర్ఇండియా విమానం కూలిపోయింది. విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. విమాన పైలెట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్నట్లు తెలిపారు. ఎయిర్ఇండియా బి787 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఘటన జరిగింది.

అహ్మదాబాద్లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలోని ధార్పూర్ వద్ద ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు రన్‌వే 23 నుంచి బయలు దేరింది. కొద్ది సేపటి తర్వాత విమానం ఏటీసీకి అందుబాటులోకి రాలేదు. విమానం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఎయిర్పోర్టు సమీపంలోనే విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.

ANN TOP 10