AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ డ్రామా…

రాష్ట్రంలో రాజకీయ డ్రామా (Political Drama) రసకందాయకంగా నడుస్తోందని కాంగ్రెస్ (Congress) సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) అన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌ (Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ టీఏస్‌పీఏస్సీ (TSPSC) పేపర్ లీక్‌ (Paper Leak)లో రెండు వారాల తర్వాత ఛైర్మన్‌ను విచారణ చేశారని, సిట్ (SIT) విచారణ వద్దని.. సీబీఐ (CBI) విచారణ కావాలని అఖిలపక్షం మొత్తం కోరిందన్నారు.

మరోవైపు టెన్త్ పేపర్ (Tenth Paper) వరుసగా రెండు రోజులు లీకైయిందని.. ఎగ్జామినేషన్ సిష్టంను పనిచేయించే వ్యవస్థ ప్రభుత్వం దగ్గర లేదని మల్లు రవి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే యూత్ కాంగ్రెస్ (Youth Congress), ఎన్‌ఎస్‌యూ‌ఐ (NSUI) కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైళ్లో పెట్టారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారి నోళ్లను అరెస్టుల ద్వారా మూయిస్తోందని, తెలంగాణ ప్రభుత్వ పాలన గాడితప్పిందని అన్నారు.

ప్రశాంత్ (Prasanth).. బండి సంజయ్‌ (Bandi Sanjay)తో వందల సార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని మల్లు రవి ప్రశ్నించారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ (BRS).. లీక్‌ల మీద పోరాడుతున్నట్లుగా బీజేపీ ఎక్స్‌పోజ్ (BJP Expose) అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న టీఏస్‌పీఏస్సీ సభ్యులు, ఛైర్మన్‌ను మార్చి కొత్త వారిని నియమించాలని మల్లు రవి డిమాండ్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10