AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఎప్పుడు, ఎక్క‌డంటే..?

పవర్ స్టార్ పవన్ క‌ల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం వచ్చే వారాంతంలో ఒక భారీ ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుక ద్వారా సినిమాపై అంచనాలను మరింత పెంచాలని నిర్మాతలు భావిస్తున్నారు.

తిరుప‌తిలోని ఎస్‌వీయూ తార‌క‌రామ క్రీడా మైదానంలో ఈ నెల 8న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌నున్నారు. దీనికోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ 7వ తేదీన తిరుప‌తి చేరుకోనున్నారు. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. కాగా, చెన్నైలో ఇటీవ‌ల సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వ‌హించిన మేక‌ర్స్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.  

17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చారిత్రక యాక్షన్ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మొఘలుల నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే సాహసోపేతమైన బాధ్యతను స్వీకరించిన ఒక పురాణ బందిపోటు వీరుడి కథే ఈ సినిమా. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి వంటి ప్రముఖ తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. 

భారీ తారాగణం, ఆసక్తికరమైన కథాంశం, అట్టహాసంగా ప్లాన్ చేస్తున్న ప్రీ-రిలీజ్ వేడుకతో ‘హరిహర వీరమల్లు’ 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని, ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10