AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నియామకాలు.. కొత్త కమిటీలు ఇవే..!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు ముఖ్యమైన కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ గురువారం ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యూహరచన వంటి కీలక అంశాలను పర్యవేక్షించేందుకు 22 మంది సభ్యులతో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏఐసీసీ నియమించింది. దీనితో పాటు, పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు, కీలకమైన సలహాలు అందించేందుకు 15 మంది అనుభవజ్ఞులతో కూడిన సలహా కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

వీటితో పాటు, భవిష్యత్తులో చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) ప్రక్రియకు సంబంధించి పార్టీ పరంగా వ్యవహారాలు చూసేందుకు ఏడుగురు సభ్యులతో డీలిమిటేషన్‌ కమిటీని నియమించింది.

కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘సంవిధాన్‌ బచావో ప్రోగ్రామ్‌’ను తెలంగాణలో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు 16 మందితో ప్రత్యేక కమిటీని, పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఏవైనా ఉల్లంఘనలు జరిగితే చర్యలు తీసుకునేందుకు ఆరుగురు సభ్యులతో క్రమశిక్షణా చర్యల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.

ANN TOP 10