AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇంకా 28 రోజులు మాత్ర‌మే మిగిలాయి.. ‘క‌న్న‌ప్ప’పై మంచు విష్ణు కౌంట్‌డౌన్ పోస్ట్..

మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో బాలీవుడ్ డైరెక్ట‌ర్ ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం ‘క‌న్న‌ప్ప’. ఈ సినిమా జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ టీజ‌ర్లు, ట్రైల‌ర్‌, పోస్ట‌ర్లు, పాట‌లు క‌న్న‌ప్పపై భారీ అంచ‌నాలు నెల‌కొల్పాయి.

 

ఈ క్ర‌మంలో తాజాగా మంచు విష్ణు మూవీపై ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్) వేదిక‌గా కౌంట్‌డౌన్ పోస్ట్ పెట్టారు. దీనికి “ఇంకా 28 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి!” అనే క్యాప్ష‌న్ ఇచ్చారు. “ఇవాళ‌ కన్నప్ప చెన్నై వీధుల్లో గర్జిస్తున్నాడు. తమిళ మీడియాకు ఇంత‌కుముందు చూడ‌ని ఫుటేజీని చూపించాం. భక్తి, యాక్షన్, మ‌న‌సును కదిలించే కథ.. జూన్ 27న థియేట‌ర్ల‌లో క‌లుద్దాం” అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.

 

కాగా, ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్ర‌లో కనిపించనున్న సంగ‌తి తెలిసిందే. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ త‌దిత‌రులు ఇత‌ర‌ కీలక పాత్రలు పోషించారు.

ANN TOP 10