AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దీపిక పదుకునేకు సందీప్ రెడ్డి వంగా స్ట్రాంగ్ కౌంటర్..!

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే (Deepika Padukone) కు బాలీవుడ్ లో ఉన్న పాపులారిటీ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఉత్తరాదిన అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటీమణిగా చలామణి అవుతోంది. ఆ క్రేజ్ తోనే గత ఏడాది ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas ) హీరోగా వచ్చిన ‘కల్కి 2898ఏడి’ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది దీపిక. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో ప్రముఖ సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీలో కూడా అవకాశం లభించింది. ఇందులో కూడా ప్రభాస్ హీరో కావడం గమనార్హం.

 

స్పిరిట్ మూవీ నుండి దీపికా అవుట్..

 

అయితే ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత అత్యధిక పారితోషకంతో పాటు పలు రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ఈమెను సినిమా నుండి తప్పించి, ఈమె స్థానంలో ప్రముఖ యంగ్ బ్యూటీ.. యానిమల్ మూవీతో సంచలనం సృష్టించి, ఓవర్ నైట్ లోనే స్టార్ అయిన త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) ని తీసుకొచ్చారు. నిజానికి దీపికా పదుకొనేను ఈ సినిమా నుండి తీసేసినప్పుడు ఆమె పీ ఆర్ టీమ్ స్త్రీ సింపథీ తెరపైకి తీసుకొచ్చింది. సినిమాలో ఎక్కువగా అసభ్యత, A- రేటింగ్ కంటెంట్, పొడిగించిన షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా అసౌకర్యంగా భావించిన దీపికా పదుకొనే ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు వార్తలు వైరల్ చేశారు. ఇక దీంతో స్త్రీ సింపథీ పెరిగిపోతున్న నేపథ్యంలో అసలు విషయాన్ని బయట పెడుతూ దీపికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. అంతేకాదు ఆమె డర్టీ పి ఆర్ గేమ్స్ ఆడుతోందని, సినిమా నుంచి తప్పుకున్న తర్వాత తన సినిమాను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తోంది అంటూ ఆరోపించారు. తాజాగా తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన పెట్టిన పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది.

 

డర్టీ పీ.ఆర్. గేమ్స్.. దీపికా కు డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్..

 

సందీప్ రెడ్డి వంగా తన ఎక్స్ ఖాతా ద్వారా.. “నేను ఎవరైనా ఒక నటుడికి కథ చెప్పేటప్పుడు, వారిపై 100% నమ్మకం ఉంచి కథను చెబుతాను. అయితే మన మధ్య బయటకు చెప్పని ఎన్డీఏ (నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్) ఉంది. కానీ మీరు ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిత్వం బహిర్గతం అవుతోంది.చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుండి తప్పుకున్నారా? మీ స్త్రీ వివాదం దీనినే సూచిస్తుందా..? ఒక చిత్ర నిర్మాతగా నా కళ వెనుక సంవత్సరాల తరబడి కష్టం ఉంది. నాకు చిత్ర నిర్మాణమే ప్రతిదీ. మీరు ఆ నమ్మకాన్ని కోల్పోయారు. ఇంకెప్పటికీ పొందలేరు కూడా.. మరొకసారి ఇలా చేయండి.. ఈసారి ఏదైనా కథ అల్లేటప్పుడు పూర్తి కథ చెప్పండి ఎందుకంటే మీరు ఇలాంటివి ఎన్ని చేసినా నేను ఏమాత్రం భయపడను. డర్టీ పి ఆర్ గేమ్స్.. ఇలాంటివి నాకు భలే సరదాను ఇస్తాయి అంటూ చాలా వ్యంగ్యంగా సందీప్ కామెంట్లు చేశారు. మొత్తానికైతే ఇక్కడ సందీప్ పరోక్షంగా దీపికా పదుకొనే లక్ష్యంగా చేసుకొని ఇలాంటి కామెంట్లు చేసినట్లు స్పష్టమవుతోంది. మరి దీనిపై దీపిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ANN TOP 10