AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దుర్గం చెరువు కేబుల్‌ వంతెన నాలుగు రోజులు బంద్‌

నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై నుంచి వాహనాల రాకపోకలపై ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈనెల 6న అర్ధరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు రోజులపాటు వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. దుర్గం చెరువు కేబుల్‌ సిస్టమ్‌ పనుల తనిఖీలో భాగంగా వంతెనపై భారీ క్రేన్‌ను ఉంచాల్సి రావడంతో ట్రాఫిక్‌ను మూసివేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు.

కాగా, రాకపోకలు నిలిచిపోయే ఆ నాలుగు రోజులపాటు ట్రాఫిక్‌ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. రోడ్‌ నం.45 నుంచి కేబుల్‌ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. అలాగే ఐకియా రోటరీ నుంచి కేబుల్‌ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైతం రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరుతున్నారు

ANN TOP 10