టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్, సందీప్ రెడ్డివంగా కాంబో లో వస్తున్న సినిమా స్పిరిట్. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా, ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపై మూవీ టీం ఫోకస్ పెట్టింది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు దర్శకుడు సందీప్ ఏర్పాట్లు చేస్తున్నాడు. అందులో భాగంగా హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో మూవీ టీం నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఇందులో హీరోయిన్ ఎవరా అంటూ, ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైం లో, చిత్ర బృందం ఈ సినిమాలో హీరోయిన్ ని ప్రకటించింది. ఆ వివరాలు చూద్దాం..
ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన త్రిప్తి డిమ్రీ..
ప్రభాస్ మూవీ స్పిరిట్ లో హీరోయిన్ గా, టాలీవుడ్,బాలీవుడ్ భామలలో ఎవరైతే బాగుంటుంది అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న టైం లో వారి అంచనాలకు దీటుగా ఇందులో హీరోయిన్ గా నటించే అవకాశం తృప్తి డిమ్రి కి ఇచ్చారు దర్శకులు. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు సందీప్ స్వయంగా ప్రకటించారు. స్పిరిట్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా తృప్తి డిమ్రి పేరును తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషలలో ఆమె పేరును పోస్ట్ చేశారు. దాదాపు తొమ్మిది భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. చైనీస్, జపనీస్ కొరియన్ భాషలలో హీరోయిన్ పేరు ప్రకటించడంతో ఈ సినిమా 9 భాషలో రిలీజ్ అవుతుందని అర్థమవుతుంది.
ఇప్పుడు ప్రభాస్ తో యానిమల్ హీరోయిన్ ..
సందీప్ రెడ్డివంగా గత చిత్రం యానిమల్ లో ఈమె కీలక పాత్రలో నటించారు. దానికి కొనసాగింపుగా రాబోయే యానిమల్ పార్కులోను ఈ భామ నటించనుంది. ఇక ఇప్పుడు స్పిరిట్ లోను తృప్తి డిమ్రి హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇప్పటికే తృప్తి డిమ్రి బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తున్నారు. యానిమల్ సినిమాలో తన అందాలను ఆరబోసి బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ భామ. ఇప్పుడు తెలుగులో ప్రభాస్ సరసన నటించడం ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.