ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు ఈరోజు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కీలక నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ఈ నేపథ్యంలో, ఈ ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఇక, వీరికి గతంలో ఏపీ హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో హైకోర్టు తీర్పును ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ జేబీ పార్దీవాలా ధర్మాసనం విచారించింది. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని న్యాయస్థానం పేర్కొంది. అందుకే బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.