త్రిబుల్ ఆర్ సినిమాతో రాజమౌళి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ మూవీకి పార్ట్-2 రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. రాజమౌళి తాజాగా పార్ట్-2పై సంచలన అప్ డేట్ ఇచ్చారు. మొన్న లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో త్రిబుల్ ఆర్ మీద కాన్సర్ట్ నిర్వహించారు. ఈవెంట్ కు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే తాజాగా రాజమౌళిని రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆటపట్టించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ వీడియోలో రాజమౌళిని చరణ్, ఎన్టీఆర్ ఆటపట్టిస్తున్న టైమ్ లోనే మీరు ఆర్ ఆర్ ఆర్-2 తీస్తారా అని ప్రశ్నించగా.. దానికి రాజమౌళి ‘ఎస్’ అనే ఆన్సర్ ఇచ్చాడు.
దాంతో త్రిబుల్ ఆర్-2 ఉంటుందనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పటికే పలుమార్లు త్రిబుల్-2 గురించి రాజమౌళి పాజిటివ్ గా స్పందించిన విషయం తెలిసిందే. రాజమౌళి లండన్ వేదికగా మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ తో సినిమాతో బిజీగా ఉంటున్నాడు. ఇటు చరణ్ కూడా పెద్ది సినిమాలో ఉన్నాడు. ఎన్టీఆర్ వరుసగా ప్రశాంత్ నీల్, కొరటాల శివతో సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు. అయితే త్రిబుల్-2 ఉంటుందని రాజమౌళి చెప్పాడు గానీ.. దానికి చాలా టైమ్ పడుతుందని తెలుస్తోంది. రాజమౌళి మహేశ్ తో తీసే మూవీకి ఎంత లేదన్నా ఇంకా ఏడాదిన్నర పడుతుంది. ఆ తర్వాత ఏ సినిమాను ప్లాన్ చేస్తాడో తెలియదు. ఓ వైపు బాహుబలి-3, మహాభారతం సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరి వాటి తర్వాత త్రిబుల్-2 ఉంటుందా.. మహేశ్ మూవీ తర్వాత ఉంటుందా అనేది తెలియాలి.