ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏర్పడిన భక్తుల రద్దీ, అనుసంధాన సమస్యలు, సిఫార్సుల దుర్వినియోగం వంటి అంశాల నేపథ్యంలో టిటిడి పాలకమండలి ఈ మార్గదర్శకాలను ప్రకటించింది.
టిటిడి ప్రకటించిన ప్రకారం, మే 15వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫార్సు లేఖలకే తాత్కాలికంగా తిరిగి అనుమతి ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల నేతలు లేదా ఇతర ప్రముఖులు ఇచ్చే సిఫార్సులపై మాత్రం వర్తించదు. గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, అటువంటి సిఫార్సులు తిరస్కరించబడతాయని టిటిడి స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం ప్రకారం, మే 16వ తేదీ నుంచి అటువంటి లేఖల ఆధారంగా టిటిడి భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించనుంది. అయితే ఈ సందర్బంగా టిటిడి అధికారులు కొన్ని నిబంధనలు కూడా అమలు చేయనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే లేఖలు తప్పనిసరిగా ప్రామాణిక లెటర్‌హెడ్ పై ఉండాలి, అలాగే సంబంధిత అధికారుల సంతకాలు తప్పనిసరిగా ఉండాలి.
ఈ నిర్ణయానికి వెనుక టిటిడి ఉద్దేశం ఏమిటంటే, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు న్యాయమైన, సమన్యాయ వ్యవస్థను అమలు చేయడం. రాజకీయంగా లేదా సిఫార్సుల ద్వారా వచ్చే భక్తుల రద్దీ వల్ల సాధారణ భక్తులకు దర్శనం కష్టమవుతోందని, అదే సమయంలో కొన్ని ముళ్ల దారులు కూడా తెరచాప అయ్యాయని అధికారులు గమనించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు.
ఇకపై దర్శనాలకు సంబంధించి మరింత స్పష్టమైన నియమావళిని రూపొందించి, అన్నివర్గాలకు సమానంగా వ్యవహరించేలా టిటిడి చర్యలు చేపడతుందని సమాచారం. భక్తుల సేవలో పారదర్శకతను పెంపొందించేందుకు ఇది ఒక ముందడుగని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్విమ్స్ తో వైద్యసేవలు విస్తృతం..
తిరుపతి స్విమ్స్ లో మరింత ఉన్నతంగా వైద్యసేవలు అందిస్తామని టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడు తెలిపారు. టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు అద్యక్షతన స్విమ్స్ సమావేశ మందిరంలో జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్విమ్స్ లో మరింత ఉన్నతంగా సేవలు అందించేందుకు గత మూడు నెలల నుండి మాజీ టిటిడి ఈవో ఐవి సుబ్బరావు అధ్యక్షతన వేసిన ప్రత్యేక ఎక్స్ ఫర్ట్ కమిటీ అధ్యయనం చేసి నివేదికను సమర్పించిందన్నారు. ఈ నివేదికలో మౌళిక సదుపాయాలు, మానవ వనరులు, వైద్య పరికరాలు, ఇంజనీరింగ్ పనులు, మరింత ఉన్నతంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య నిపుణుల సేవలు, నిధుల సేకరణ తదితర అంశాలపై నివేదిక సమర్పించిందన్నారు. ఎక్స్ ఫర్ట్ కమిటీ నివేదికపై టిటిడి బోర్డులో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్విమ్స్ అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇస్తున్న ఎక్స్ ఫర్ట్ కమిటీ ఛైర్మెన్ డా. ఐ.వి. సుబ్బారావు, ఇతర సభ్యులను టిటిడి చైర్మన్ కోరారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో జె. శ్యామల రావు మాట్లాడుతూ, స్విమ్స్ చాలా ప్రతిష్టాకమైనదని, 2021లో టిటిడిలోకి స్విమ్స్ ను అప్పగించారని, స్విమ్స్ కి టిటిడి నుండి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని, సంవత్సరానికి రూ. 60 కోట్ల గ్రాంట్ తో పాటు ఎంప్లాయ్ హెల్క్ స్కీం, ప్రాణదాన ట్రస్ట్ , వివిధ రకాల ట్రస్ట్ ల ద్వారా సుమారు రూ. 100 కోట్లుకు పైగా సపోర్ట్ చేస్తున్నామని అన్నారు.
స్విమ్స్ అనేది పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్థాపించబడిందని, సంవత్సరానికి 18,000 సర్జనీలు, దాదాపు 4. 50 లక్షలుకు పైగా ఔట్ పేసెంట్లు, 47 వేల ఇన్ పేసెంట్లు వైద్య సేవలు పొందుతున్నారని, ఇందులో పేదలే అత్యధికంగా ఉన్నారని తెలిపారు. స్విమ్స్ లో భవిష్యత్ తరాలకు సరిపడేలా ప్లాన్ ప్రకారం నూతన భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, అంకాలజీ , చిన్న పిల్లల హెల్త్ కోసం నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.
అంకాలజీని లెవన్ వన్ సెక్టార్ గా తీసుకెళ్లేందుకు , స్విమ్స్ లో ఫ్యాకల్టీ సమస్య, మానవ వనరులు, మౌళిక సదుపాయాల కల్పన, నిర్మాణాలు, నిధుల సమీకరణ, స్వచ్ఛంగా వచ్చే నిపుణులైన వైద్యుల సేవలు తదితర అంశాలు, సమస్యల పరిష్కారం కేసం ఎక్స్ ఫర్ట్ కమిటీ వేశారని, ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై జనరల్ కౌన్సిల్ చర్చించామన్నారు.