AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

52వ సీజేగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం..!

భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి (బి.ఆర్. గవాయి) నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ నియామకంతో జస్టిస్ గవాయి భారతదేశానికి 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినట్టయింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి సారథ్యం వహించనున్న జస్టిస్ గవాయి నియామకంలో ఒక చారిత్రక విశేషం ఉంది. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన తొలి బౌద్ధ మతస్థుడిగా ఆయన గుర్తింపు పొందారు.

ANN TOP 10