అందరికీ ఆరోగ్య సలహాలు ఇచ్చే డాక్టర్లు కూడా నేరం చేస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలాంటి కేసు ఒకటి తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఒక ప్రఖ్యాత ఆస్పత్రిలో ఉన్నత పదవిలో ఉన్న ఒక మహిళా డాక్టర్ డ్రగ్స్‌కు బానిసగా మారింది. ఆ వ్యసనంలో పడి డ్రగ్స్ కొనుగోలు కోసం ఆమె ఏకంగా తన రూ.కోటి ఇల్లుని విక్రయించేసింది. అయితే ఆమె డ్రగ్స్ కొనుగోలు చేసే సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. హైదారాబాద్ నగరంలోని ప్రముఖ ఒమెగా ఆస్పత్రిలో సిఈఓ పదవి ఉన్న డాక్టర్ నమ్రత చిగురుపాటిని ఇటీవల తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమె 53 గ్రాముల కొకైన్ ని ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా కొనుగోలు చేసే సమయంలో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. లక్షలు ఖరీదు చేసి ఈ డ్రగ్స్ కొనుగోలు కోసం ఆమె తన రూ.కోటి ఇంటిని విక్రయించేసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.
అయితే ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ముందు నార్కోటిక్స్ పోలీసులు ఆమెపై నిఘా పెట్టారు. ఆమె కుటుంబానికి ముందుగానే సమాచారం ఇచ్చారు. ఆమె డ్రగ్స్ కొనుగోలు చేస్తోందని.. కొకైన్ అలవాటు కాస్తా ఆమెకు వ్యసనంగా మారిందని తమకు సమాచారం ఉందని చెప్పారు. అయినా మే 9, 2025 న డాక్టర్ నమత్ర మళ్లీ డ్రగ్స్ కొనుగోలు కోసం ప్రయత్నించింది. ఆమె బాలకృష్ణ రాంప్యార్ రామ్ అనే వ్యక్తిని సంప్రదించింది. ఆ రోజు అతడిని కలిసి రూ.5 లక్షలు నగదు ఇచ్చి తనకు డ్రగ్స్ కావాలని అడిగింది. ఇదంతా జరిగే సమయంలో పోలీసులు డాక్టర్ నమ్రతను గమనిస్తున్నట్లు ఆమెకు తెలియదు.
ఆ తరువాత డ్రగ్ పెడ్లర్ బాలకృష్ణ ఆ డబ్బులు తీసుకొని ముంబై వెళ్లాడు. అక్కడ వన్ష్ ఠక్కర్ అనే డిజెని కలిసి.. అతడి వద్ద నుంచి కొకైన్ కొనుగోలు చేశాడు. అంతుకుముందే డాక్టర్ నమ్రత ఫోన్, వాట్సాప్ ద్వారా వన్ష్ ఠక్కర్ ని సంప్రదించి.. తనకు వెంటనే కొకైన్ కావాలని ఆర్డర్ చేసింది. దీనికి సంబంధించి వాట్సాప్ చాట్స్ కూడా ఉన్నాయి.
ఎలా పట్టుకున్నారు?
మే 11, 2025న డ్రగ్ పెడర్ల బాలకృష్ణ రామ్ ఆ కొకైన్ తీసుకొని డాక్టర్ నమ్రత వద్దకు వచ్చాడు. ఆమె చేతికి ఆ కొకైన్ ఇచ్చే సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. ఆ తరువాత ఇద్దరినీ అదుపులోకి తీసుకొని డాక్టర్ నమ్రత ఫోన్ మెసేజ్ లు, వాట్సాప్ చాట్ ల ద్వారా వన్ష్ ఠక్కర్ గురించి తెలుసుకున్నారు. పోలీసులు వన్ష్ ఠక్కర్ ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది.
డాక్టర్ నమ్రత అరెస్ట్ పై ఒమెగా హాస్పిటల్ వివరణ
మే 11న డాక్టర్ నమ్రత అరెస్ట తరువాత ఒమెగా హాస్పిటల్ ఆధికారికంగా ఈ అంశంగా ప్రకటన చేసింది. ఒమెగా ఆస్పత్రి చైర్మెన్ డాక్టర్ మోహన వంశీ ఈ డ్రగ్స్ కేసు గురించి స్పందిస్తూ.. ఈ కేసు డాక్టర్ నమ్రత వ్యక్తిగతమని ఆస్పత్రికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. దేశ వ్యాప్తంగా 14 క్యాన్సర్ కేర్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న ఒమెగా హాస్పిటల్స్ గురించి ప్రచురించే ముందు మీడియా సంస్థలు డాక్టర్ నమ్రత విషయంలో పూర్తి నిజాలు తెలుసుకొని వార్తలు ప్రసారం చేయాలని ఆయన అన్నారు.