పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తోంది. భారత పౌరులను లక్ష్యంగా దాయాది దేశం దాడులు చేస్తోంది. పరిస్థితి గమనించిన భారత్ సైన్యం మూడు వైపులా పాకిస్తాన్‌ను చుట్టుముట్టింది. కేవలం ఎల్ఓసీ వెంబడి మాత్రమే కాకుండా ఆరేబియా సముద్రం వైపు భారత నేవీ రౌండప్ చేసింది. పాకిస్తాన్‌కు సమాచారం చేరుకునే లోపు కరాచీ పోర్టుపై మిస్సైల్ వర్షం కురిపించింది భారత నేవీ.
వార్ మొదలైంది?
పాకిస్థాన్ వాణిజ్యం కేంద్రానికి అత్యంత కీలకమైనది కరాచీ పోర్టు. ఆ పోర్టుపై భారత నావికా దళం భీకర దాడి చేసింది. గతవారం అరేబియా సముద్రంలో మకాం వేసిన ఐఎఫ్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించింది. భారత్ దెబ్బకు కరాచీ పోర్టు మంటల్లో చిక్కుకుంది. అక్కడే ఉన్న దాదాపు 10 భారీ నౌకలు ధ్వంసం అయినట్టు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ వ్యాపార కేంద్రాలను భారత్ ఏనాడూ టచ్ చేయలేదు. గడచిన నాలుగు రోజులు భారత పౌరులు ఉండే నివాసం ఉండే ప్రాంతాలపై క్షిపణులు ఎక్కుపెట్టింది. పరిస్థితి గమనించిన భారత్, ఆపరేషన్ సింధూర్‌ని కంటిన్యూ చేసింది. 1971 వార్ తర్వాత కరాచీ పోర్టుపై భారత్ ఎటాక్ చేయడం ఇదే ఫస్ట టైమ్.
అర్థరాత్రి దాటిన తర్వాత
గురువారం అర్ధరాత్రి దాటిన భారత నేవీ దళాలు ఆరేబియా సముద్రం నుంచి క్షిపణుల వర్షం కురిపించాయి. పాకిస్తాన్‌కు కీలకమైన నేవీ స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించి భారత్-పాకిస్తాన్ దేశాల నంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నేవీలోని ఉన్నతస్థాయి వర్గాలను ఉటంకిస్తూ నేషనల్ మీడియా టీవీ ఛానెళ్లు, పలు వెబ్‌సైట్లు కథనాలను ప్రసారం చేశాయి.
భారత్ దూకుడు దాటికి పాకిస్థాన్ తీరంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రక్షణ శాఖ వర్గాల సమాచారం మేరకు అరేబియా సముద్రంలో ఐఎఫ్ఎస్‌విక్రాంత్‌తోపాటు మొత్తం 26 యుద్ధ నౌకలు మోహరించాయి. గురువారం అర్ధరాత్రి వేళ కరాచీ, ఓమ్రారా పోర్టులపై ఐఎఫ్ఎస్ విక్రాంత్ క్షిపణుల వర్షం కురిపించింది.
రాత్రి పాక్‌లో విద్యుత్ నిలిపివేత?
ఆ సమయంలో కరాచీ సిటీ అంతా నల్లగా పొగ కమ్మేసింది. పోర్టులో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. కరాచీ పోర్టులో కీలక ప్రాంతాలు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోది. నేవీ దాడుల్లో రెండు పోర్టులు డ్యామేజ్ బాగా అయ్యిందని తెలుస్తోంది. ఎల్‌వోసీ వెంబడి సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, ఆర్నియాలపై పాకిస్తాన్ ఎనిమిది క్షిపణులను ప్రయోగించినట్టు వార్తలు వస్తున్నాయి. వాటిని భారత వైమానిక దళాలు అడ్డగించినట్టు సమాచారం.
పాకిస్తాన్‌తో ఇప్పటివరకు భారత్‌కి చెందిన ఆర్మీ, వైమానిక దళాలు మాత్రమే రంగంలోకి దిగాయి. గతరాత్రి నేవీ కూడా రంగంలోకి దిగేసింది. పాక్‌లోని శాటిలైట్ ద్వారా గుర్తించిన 12 ఉగ్రవాదుల స్థావరాలపై నేవీ, వైమానిక దళాలు సంయుక్తంగా భీకర దాడులు చేశాయి. దాయాది దేశంలో ఎటు చూసినా రాత్రంతా చీకట్లు అలముకున్నాయి. ప్రత్యర్థులకు ఆనవాళ్లు తెలియకుండా చాలా నగరాల్లో విద్యుత్ నిలిపి వేసింది.