AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన భారత్.. ..

భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పులకు భారత దళాలు అత్యంత సమర్థవంతంగా ప్రతిస్పందించాయి. ఈ క్రమంలో పలు పాకిస్థానీ సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పాక్ సైనిక పోస్టును భారత దళాలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలను కూడా భారత సైన్యం తొలిసారిగా విడుదల చేసింది.

 

మే 8-9 తేదీల మధ్య రాత్రి పాకిస్థాన్ సాయుధ దళాలు పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించి పలు దాడులకు పాల్పడ్డాయని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ పొడవునా పాక్ దళాలు అనేకసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఏడీజీ పీఐ-ఇండియన్ ఆర్మీ ఎక్స్ ద్వారా తెలిపింది. పాకిస్థాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల ప్రయత్నాలను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టిన కొద్ది గంటల్లోనే పాక్ దళాలు మళ్లీ కాల్పులకు తెగబడ్డాయి. దీనికి ప్రతిగా భారత సైన్యం ఎదురుదాడికి దిగింది.

 

ఈ ప్రతిదాడుల్లో భాగంగా ఏ సెక్టార్‌లో పాకిస్థాన్ సైనిక పోస్టు ధ్వంసమైందనేది స్పష్టంగా తెలియరాలేదు. అయితే, నిరంతర కాల్పుల విరమణ ఉల్లంఘనలకు భారత సైన్యం గట్టిగా బదులిస్తోందనడానికి ఇది సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని, కాల్పుల విరమణ ఉల్లంఘనలకు సైన్యం ‘తగిన రీతిలో సమాధానం‘ ఇచ్చిందని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. “దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో భారత సైన్యం కట్టుబడి ఉంది. అన్ని దుష్ట పన్నాగాలకు బలంతోనే ప్రతిస్పందిస్తాం,” అని సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు, జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఓ భారీ చొరబాటు యత్నాన్ని భగ్నం చేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10