తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తెలంగాణ దివాలా తీసిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. “రాష్ట్రం దివాలా తీయలేదు. మిస్టర్ ‘చీప్ మినిస్టర్’. నిజానికి మేధోపరంగా దివాలా తీసింది, నైతికంగా దిగజారింది మీరూ, మీ అవినీతి కాంగ్రెస్ పార్టీయే” అంటూ ఘాటుగా విమర్శించారు.