AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లైకా ప్రొడక్షన్ జోరు… 9 కొత్త సినిమాల ప్రకటన..

ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025 గురువారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం విదితమే. ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారత చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.

 

ఈ క్రమంలో లైకా సంస్థ తమ భవిష్యత్తు ప్రాజెక్టులపై సంచలన ప్రకటన చేసింది. ప్రధానమంత్రి మోదీ విజన్, లక్ష్యాలకు అనుగుణంగా భారత్‌ను అంతర్జాతీయ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీర్చిదిద్దేందుకు తొమ్మిది ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు లైకా ప్రకటించింది. మహావీర్ జైన్ ఫిల్మ్స్‌తో కలిసి ఈ ప్రాజెక్టులను సంయుక్తంగా నిర్మించనున్నట్లు వెల్లడించింది.

 

ప్రపంచ స్థాయి సంస్థగా లైకా గ్రూప్ భారతీయ సినిమాను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తుందని సంస్థ ఛైర్మన్ డాక్టర్ అల్లిరాజా సుభాస్కరణ్ తెలిపారు. మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆకర్షణీయ కథలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మహావీర్ జైన్ ఫిల్మ్‌తో భాగస్వామ్యం కలిగి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

ANN TOP 10