AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘వేవ్స్’ 2025ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ..

ముంబ‌యిలోని జియో వ‌రల్డ్ సెంట‌ర్‌లో ప్ర‌పంచ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (WAVES) 2025 ప్రారంభ‌మైంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ ఈవెంట్‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న మోదీ భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమ ఉద్దేశించి ప్ర‌సంగించారు. చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధికి న‌టీన‌టులు, క‌ళాకారులు అందిస్తోన్న సేవ‌ల‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌శంసించారు.

 

కాగా, కేంద్ర సమాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఈ స‌మ్మిట్ ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు సాగ‌నుంది. అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త్‌ను గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్‌గా మార్చాల‌నే ల‌క్ష్యంతో కేంద్రం ‘వేవ్స్’ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. ఇది మీడియా, వినోద పరిశ్రమల‌ను ఒకచోట చేర్చే అద్భుత కార్యక్ర‌మం.

ANN TOP 10