AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అల్లు అర్జున్ జోడిగా మృణాల్..!

ప్రజంట్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అంటే జ‌నాల‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు. ‘పుష్ప2’ సినిమాతో బాక్సాఫీస్ ద‌గ్గర భారీ హిట్ కొట్టాడు. కాగా ఈ చిత్రం ఏకంగా రూ.1800 కోట్లు వసూలు చేసి దాదాపు ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్‌ చేసింది. జీనియస్‌ సుకుమార్‌తో కలిసి సంచ‌ల‌నాల‌కి తెర లేపాడు. దీంతో అల్లు అర్జున్ తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక వరుస దర్శకులతో కమిట్ మెంట్ అయినన్నటికి మొదటగా కోలీవుడ్‌ డైరెక్టర్‌ అట్లీ తో రాబోతున్నాడు బన్నీ. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్‌గా, ఇండియాలో ఇప్పటి వరకు రాని జోనర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. మూవీకి సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. అయితే..

 

సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ మూవీలో, కథ రీత్యా ముగ్గురు కథానాయికలు కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, అందులో ఓ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ ను రంగంలోకి దించనున్నారని సమాచారం. అంతేకాదు ఇప్పటికే ఆమెతో కథా చర్చలు కూడా పూర్తయ్యాయని.. ఇటీవల తను లుక్ టెస్ట్ లో పాల్గొందని తెలుస్తోంది. అలాగే మరోవైపు మిగిలిన రెండు నాయికా పాత్రల కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మలు జాన్వీ కపూర్, దీపికా పదుకొణె పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఇప్పటికే జాన్వీతో చర్చలు పూర్తయ్యాయని.. దీపికతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని సమాచారం. కాగా త్వరలోనే ఈ వార్త పై స్పష్టత వచ్చే అవకాశముందిp.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10