ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా, పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచడం ఈ అభివృద్ధి ప్రస్థానంలో ఒక భాగమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. “అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పని చేస్తున్నాం” అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
పిఠాపురంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రి స్థాయిని పెంచుతున్నామని, దీనివల్ల స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నా waరు.