తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో త్రివిక్రమ్ రైటింగ్ అంతా ఇంప్రెస్సివ్ గా అనిపించట్లేదు కానీ ఒకప్పుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అంటేనే నెక్స్ట్ లెవెల్ అనిపించేవి. స్వయంవరం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్, అతి తక్కువ కాలంలోనే సూపర్ హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం చేయని సినిమాలకు కూడా త్రివిక్రమ్ కి మంచి పేరు వచ్చింది. నువ్వు నాకు నచ్చావ్, స్వయంవరం, మల్లీశ్వరి, మన్మధుడు, నువ్వే కావాలి సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడు అందరికీ టక్కున గుర్తొచ్చేది త్రివిక్రమ్ శ్రీనివాస్. అంటే డైరెక్టర్ ను కూడా త్రివిక్రమ్ మాటలు డామినేట్ చేసేవి అని అర్థం. ఇంకా త్రివిక్రమ్ డైరెక్టర్ అయిన తర్వాత కేవలం తరుణ్, నితిన్ మినహా ఇస్తే మిగతా సినిమాలన్నీ కూడా స్టార్ హీరోలతోనే చేశారు.
వెంకటేష్ నాని కాంబినేషన్
చాలామందికి ఒకప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నాని సినిమా చేస్తే బాగుంటుంది అని కోరిక ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ చూడాలంటే క్యూరియాసిటీ పెరిగేది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్, నాని హీరోలుగా ఒక సినిమా చేయాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యారట. కానీ ఆ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. నాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు జెర్సీ సినిమా చేసిన సంగతి తెలిసిందే, ఆ సినిమా ఓపెనింగ్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్ట్ గా వచ్చారు. ఇక ఆ సినిమా సక్సెస్ మీట్ కి విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. బహుశా ఆ తరుణంలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమాను సెట్ చేసే పనిలో పడ్డారేమో. అయితే ఈ విషయంపై నాని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నేను వెంకటేష్ గారు కలిసి ఒక సినిమాలో చేయాల్సి ఉంది కానీ త్రివిక్రమ్ సార్ కి ఏమైంది నాకు తెలియదు అందువలన అది జరగలేదు అంటూ చెప్పుకొచ్చాడు.
వెంకటేష్ తో సినిమా
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు అంటే చాలామందికి క్యూరియాసిటీ విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే వెంకటేష్ కెరియర్ లో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ డైలాగ్స్ వెంకటేష్ పలికిన విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్ ని ఎవరు మర్చిపోలేరు. ఒక రైటర్ గా వెంకటేష్ తో సినిమా చేశాడు కానీ ఒక దర్శకుడిగా త్రివిక్రమ్ ఎప్పుడూ పని చేయలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశం ఉంది అని వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు త్రివిక్రమ్ శివ కార్తికేయన్ ఎంతో సినిమా చేస్తాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో తేలాల్సి ఉంది.