AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముంబై నటి కేసు.. జైలుకి ఐపీఎస్ ఆంజనేయులు..

తోటి ఉద్యోగులు చేత సెల్యూట్ కొట్టించుకునేవారు.. సార్ అని అందరూ గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు కటకటాల పాలయ్యారు ఆ అధికారి. చాలామంది అధికారులకు ఆయన గుర్తు ఉండే ఉంటుంది సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు. ముంబై నటి కాదంబరీ జెత్వానీ వేధింపుల కేసులో ఆయన గుట్టు అంతా బయట పెట్టేశారు అధికారులు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన ఆయన, నటి విషయంలో కొందరు ఐపీఎస్ అధికారులను ఎలా ఉపయోగించుకున్నారో కళ్లకు కట్టినట్టు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.

 

ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు, సిన్సియర్ అధికారిగా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు. కాదంబరి కేసులో ప్రతీది ఆయన చెప్పినట్టే జరిగిందని పేర్కొన్నారు. పైస్థాయిలో ఏం జరిగింది అనేది బయటకు రాలేదు. కాకపోతే నటిని వేధించడం, కొంతమంది అధికారులను బెదిరించి మరీ పనులు చేయించినట్టు తేల్చారు. అక్రమ కేసులు బనాయించేందుకు నకిలీ పత్రాలు సైతం క్రియేట్ చేసిన ఘనడు. విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇస్తే.. తనకేంటి సంబంధమని దబాయించిన వ్యక్తి ఆయన. కాలం బాగుంటే రేపో మాపో ఏపీ డీజీపీ కావాల్సిన వ్యక్తి జైలుకి వెళ్లారు.

 

జైలుకి ఐపీఎస్ ఆంజనేయులు

 

ముంబై నటి కాదంబరి జెత్వానీవేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులకు న్యాయస్థానం మే 7 వరకు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయన్ని కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి రేపో మాపో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. వేధింపుల వెనుక ఎవరి ప్రమేయం ఉంది అనేది తెలాల్సివుంది. అది తెలిస్తే ఈ కేసు క్లయిమాక్స్‌కు వచ్చినట్టే. రిమాండ్ సందర్భంగా న్యాయస్థానంలో పావు గంటపాటు ఆంజనేయులు స్వయంగా తన వాదనలు వినిపించారు.

 

కోర్టులో ఆంజనేయులు వాదనలు

 

తాను విచారణకు సహకరించడం లేదన్న వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు ఆంజనేయులు. జెత్వాని ఇచ్చిన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీసులు తనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు, సాక్షిగా తాను లేనన్నారు. ఆ కేసులో విచారణకు ఎందుకు హాజరు కావాలో చెబితే వస్తానని అధికారులకు వివరించినట్టు న్యాయస్థానం ముందు వెల్లడించారు. ఈ కేసును తాను ఏస్థాయిలో పర్యవేక్షించలేదని చెప్పే ప్రయత్నం చేశారు.

 

కేసు నమోదు చేసి చాలా నెలలు గడుస్తున్నా, తాను ఎక్కడికీ పారిపోలేదని గుర్తు చేశారు. వాంగ్మూలం ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నట్టు విశాల్‌గున్నీ తనకు ఫోన్‌ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. వాంగ్మూలం ఇవ్వవద్దని తాను ఐపీఎస్ విశాల్‌గున్నీకి చెప్పానని, శాఖాపరంగా చేపట్టిన విచారణ ఆధారంగా చేసుకుని తనను అరెస్టు చేయడం తప్పన్నారు. న్యాయస్థానంలో ఆంజనేయులు కేవలం చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేశారు. కాకపోతే వాటికి ఎలాంటి ఆధారాలు లేవు.

 

రేపో మాపో కస్టడీకి ప్లాన్

 

11 పేజీల రిపోర్టును రిమాండ్ రిపోర్టులో దేశంలో ఏ ఐపీఎస్ అధికారి చేయని ఆరాచకాలు ఆయన చేసినట్టు ప్రస్తావించారు. ఫేక్ డాక్యుమెంట్స్ పేరుతో ఆస్తి కొనుగోలు చేశారంటూ విద్యాసాగర్.. కాదంబరిపై కేసు పెట్టాడు. 100 రూపాయల పాత స్టాంప్ పేపర్‌ని థానెలో కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. దానిపై విద్యాసాగర్ సంతకం ఆమె ఫోర్జరీ చేసినట్టు క్రియేట్ చేశారు. కేసు నమోదుకు ముందుగానే ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీ, క్రాంతి రానా టాటాలను ముంబైకి తరలించడం, ఆపై అరెస్టు చేశారు.

 

ఈ కేసులో తాము ఇన్వాల్వ్ కామని ఐపీఎస్ విశాల్ గున్నీ చెప్పారు. వెంటనే ఆయన్ని సీఎంవోకి పిలిచి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని వివరించారు. ఇదే విషయాన్ని విచారణ అధికారులకు ఆయన చెప్పారు. ఈ కేసులో వైసీపీ నేత విద్యాసాగర్‌-ఏ1 కాగా, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు-ఏ2గా ఉన్నారు. ఐపీఎస్ కాంతిరాణా తాతా-ఏ3, విశాల్‌ గున్ని-ఏ6 గా పేర్కొన్నారు. ఈ కుట్ర అంతా అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిందని, ఇదంతా నిందితుల కాల్‌ డేటా విశ్లేషణలో తేలిందన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10