AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదే: రంభ..

టాలీవుడ్ లోనే కాదు… కోలీవుడ్ లో సైతం స్టార్ గా కొనసాగిన ఘనత మన తెలుగు అమ్మాయి రంభది. విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. స్క్రీన్ నేమ్ ను రంభగా మార్చుకుంది. అప్పట్లో దాదాపు అందరు టాప్ హీరోలతో ఆమె నటించింది. బాలీవుడ్ లో సైతం మెరిసింది. చివరగా ‘దేశముదురు’ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కెనడాలో సెటిల్ అయిపోయింది. తాజాగా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఓ టీవీ షోలో జడ్జ్ గా కనిపించింది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రంభ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

 

పెళ్లి తర్వాత తాను కెనడాలో స్థిరపడ్డానని రంభం తెలిపింది. ఒక తల్లిగా పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని… అందుకే సినిమాలకు దూరమయ్యానని చెప్పింది. తనకు ఆరేళ్ల బాబు, 14, 10 ఏళ్లు ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని… ప్రస్తుతం వారి పనులు వారు చేసుకోగలుగుతున్నారని తెలిపింది. తనకు సినిమాలపై ఉన్న ఆసక్తి గురించి తన భర్తకు తెలుసని… అందుకే మళ్లీ సినిమాల్లో నటిస్తానంటే ఆయన ఒప్పుకున్నారని చెప్పింది.

 

ఒక డ్యాన్స్ షోకు జడ్జిగా చేశానని… ఆ షో చేయడానికి తొలుత భయపడ్డానని… కానీ, అంతా హ్యాపీగా జరిగిపోయిందని రంభ తెలిపింది. ప్రేక్షకుల చప్పట్లు తనలో ఉత్సాహాన్ని నింపాయని చెప్పింది. తాను మళ్లీ నటించడానికి రెడీగా ఉన్నానని తెలిపింది. తనతో కలిసి నటించిన చాలా మంది ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారని… వారి సహకారం కూడా తనకు ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం తన చేతిలో కొన్ని ఆఫర్ లు ఉన్నాయని… త్వరలోనే తాను నటించబోయే సినిమా గురించి వెల్లడిస్తానని తెలిపింది.

ANN TOP 10