AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ నెల 25న ఆకాశంలో అద్భుతం దృశ్యం..!

ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెల 25న తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ అద్భుతం చోటుచేసుకోనుందట. శుక్రుడు, శని గ్రహాలు చంద్రుడికి చేరువగా రావడంతో ఆకాశంలో స్మైలీ ఇమేజ్ ఏర్పడనుందని తెలిపారు. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా వెల్లడించింది. శుక్రుడు, శని గ్రహాలు ప్రకాశవంతంగా మెరుస్తాయని, దీంతో ఎలాంటి పరికరాల అవసరం లేకుండా నేరుగానే ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని చెప్పారు.

 

టెలిస్కోప్, బైనాక్యులర్లతో చూస్తే మరింత క్లారిటీగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అద్భుత దృశ్యాన్ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్, గండిపేట సరస్సు, షామిర్ పేట, వరంగల్‌లో పాకాల సరస్సు లేదా భద్రకాళి ఆలయం ప్రాంతంలో వీక్షించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏపీలో అయితే ప్రకాశం బ్యారేజీ, భవానీ ఐలాండ్, కొండపల్లి అటవీ ప్రదేశాల వద్ద ఈ అద్భుతాన్ని చూడొచ్చని చెప్పారు. ఆర్ కె బీచ్, డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ వద్ద, తిరుపతిలో కొండ వ్యూ పాయింట్, చంద్రగిరి కోట సమీపంలోనూ చూడవచ్చన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10