AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బ్రాహ్మణులపై స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తాజాగా చేసిన కామెంట్లు ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన నుంచీ ఇలాంటి మాటలు రావడంతో ఒక్కసారిగా సినీ సెలబ్రిటీలు, సినీ ప్రేక్షకులే కాదు, యావత్ దేశ ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. అనురాగ్ కశ్యప్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకూ ఆయన ఏమన్నారు అనే విషయానికి వస్తే.. అనురాగ్ బ్రాహ్మణ వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సామాజిక సంఘ సంస్కర్తలైన జ్యోతి రావు , సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రతో సినిమా చేస్తున్నారు అనురాగ్. అయితే ఈ సినిమాకు సెన్సార్ కావడం లేదు. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అలాగే బ్రాహ్మణ సమాజంలోని ఒక వర్గం పై తీవ్ర విమర్శలు గుప్పించారు అనురాగ్ . “బ్రాహ్మణులపై నేను మూత్రం పోస్తాను..ఎవరికైనా అభ్యంతరమా? అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్తలు సోషల్ మీడియాలో భగ్గుమంటున్నాయి.

 

2028 వరకూ నేను బిజీ..

 

ఇకపోతే అనురాగ కశ్యప్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న బాలీవుడ్ పరిస్థితి చాలా అధ్వానంగా తయారయిందని, అక్కడ తాను ఉండలేనని, అందుకే హిందీ పరిశ్రమను వీడుతున్నాను అని ప్రకటించి, దక్షిణాది సినీ పరిశ్రమకు షిఫ్ట్ అయిపోయారు. దీంతో ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాడేమో.. అందుకే అలా నేరుగా చెప్పకుండా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ పై విమర్శలు గుప్పిస్తున్నాడు అంటూ కూడా ఈయనను చాలామంది నెటిజన్స్ విమర్శించారు. అయితే అలా విమర్శలు వచ్చాయో లేదో ఇలా ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు అనురాగ్. “నేను మారలేదు.. సినిమాలు మానలేదు.. కేవలం సిటీ మారాను.. తిక్కతో అన్ని వదిలేసి వెళ్లిపోయాడు అనుకునే వాళ్ళకి.. నేను చెప్పేది ఏమిటంటే..? ప్రస్తుతం నేను 2028 వరకు బిజీగా ఉంటాను. నా అంత బిజీ ఇంకెవరూ లేరు” అంటూ కామెంట్లు చేశారు.

 

అందరూ నోరు మూసుకోండి.. అనురాగ్ ఘాటు వ్యాఖ్యలు..

 

ఇక ప్రస్తుతం ఈయన సినిమాల విషయానికి వస్తే..ఈ ఏడాది మూడు సినిమాలు, వచ్చే ఏడాది రెండు సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్తానని.. క్షణం కూడా ఖాళీగా లేనంతగా పని దొరికింది అని తెలిపారు. దీనివల్ల రోజుకు మూడు ప్రాజెక్టులైనా తిరస్కరించాల్సి వస్తోందని, కాబట్టి అందరూ నోరు మూసుకోండి అంటూ విమర్శించే వారికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు అనురాగ్ కశ్యప్. ఇక ప్రస్తుతం ఈయన మహారాజా, విడుదల2, రైఫిల్ చిత్రాలతో సౌత్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఇక ప్రస్తుతం డెకాయిట్ తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇక ఇప్పుడు బ్రాహ్మణులను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక వర్గాన్ని ప్రత్యేకంగా ఇలాంటి మాటలతో బాధపెట్టడం నిజంగా అనిర్వచనీయం అంటూ అనురాగ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి మాటల వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చూడాలి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10