AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో మలయాళ డబ్బింగ్ సినిమా..!

మలయాళంలో విడుదలై విజయవంతమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇదివరకే ‘ప్రేమలు’, ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రాలు మలయాళంతో పాటు తెలుగులోనూ ఘన విజయం సాధించాయి.

 

ఇప్పుడు అదే కోవలో మరో మలయాళ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ ప్రధాన పాత్రలో నటించిన ‘అలప్పుజ జింఖానా’ చిత్రం తెలుగులో విడుదల కానుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీని జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరీ సంయుక్తంగా నిర్మించగా, ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించారు.

 

ఈ చిత్రం మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. విష్ణు విజయ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ‘జింఖానా’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నెల 25న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

ANN TOP 10