ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నేతలు, మహిళా నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు.
రజతోత్సవ సభలో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు, సభను విజయవంతం చేయడంలో వారి భాగస్వామ్యం, కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ విప్ దాస్యం విజయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీశ్ కుమార్, జీవన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు