AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పీవోకేపై పాకిస్థాన్‌కు భారత్ గట్టి కౌంటర్..!

చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌తో పాకిస్థాన్‌కు ఉన్న ఏకైక సంబంధమని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

 

కశ్మీర్ తమకు జీవనాడి అంటూ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ గట్టిగా స్పందించింది. విదేశీ భూభాగం పాకిస్థాన్‌కు జీవనాడి ఎలా అవుతుందని ప్రశ్నించింది. కశ్మీర్ భారత భూభాగమని తేల్చి చెప్పింది.

 

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాట్లాడుతూ, కశ్మీర్ విషయంలో తమ వైఖరి సరైనదేనని అన్నారు. కశ్మీర్ ను ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ పై విధంగా స్పందించింది.

 

పాక్ ఆక్రమిత కశ్మీర్ లేకుండా జమ్ము కశ్మీర్ అసంపూర్ణమని గతంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్ అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్‌కు పీవోకే విదేశీ భూభాగమే అవుతుందని, అందుకే ఆ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తోందని అన్నారు.

ANN TOP 10