AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సందీప్ వంగా డైరెక్షన్లో రామ్ చరణ్‌..? మెగా ఫ్యాన్స్ కు పునాకాలే..?

కేవలం రెండే రెండు సినిమాలతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. మార్కెట్‌లో ఆయనకు ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. తన డైరెక్షన్‌కి టాలీవడుడ్ టూ బాలీవుడ్ అంతా ఫిదా అయ్యారు. ఒక స్టార్ హీరో స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీ తాలూకు పనుల్లో బిజీగా ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టు మొదలుపెడతాడా.. అని ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ వేసవి నుంచే ప్రారంభమయ్యే సూచనలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే..

 

ప్రజంట్ సందీప్ రెడ్డి వంగ కమిట్ అయిన మూవీ లిస్టులో ‘యానిమల్ పార్క్’, ‘అల్లు అర్జున్ 24’, ‘స్పిరిట్’ ఈ మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే బన్నీది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు లేదు. రన్ బీర్ ఏమో ‘రామాయణం’ రెండు భాగాలు, లవ్ అండ్ వార్, ధూమ్ 4తో ఇలా వరుస చిత్రాలు లైన్ లో పెట్టాడు. అంటే రణ్ బీర్ కూడా ఇప్పుడంత సులభంగా దొరికేలా లేడు. సో దాని స్థానంలో రామ్ చరణ్‌తో ఒక సినిమా చేసే ఆలోచనలో సందీప్ వంగా ఉన్నట్టు లేటెస్ట్ గాసిప్ ఒకటి వినపడుతుంది. అంతేకాదు దీనికి సంబంధించి ఒక రౌండ్ చర్చలు కూడా జరిగాయట. కార్యరూపం దాల్చడానికి టైం పట్టొచ్చని వినికిడి. ఇక ‘పెద్ది’ మూవీ కంప్లిట్ అయ్యాక చరణ్ సుకుమార్‌తో అనుకున్న RC 17 కాస్తా నెంబర్ మారి 18 అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి క్లారిటీ రావాలి అంటే అప్‌వెట్ చేయక తప్పదు.

ANN TOP 10