AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి వర్గ విస్తరణ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమయంలో తన గొంతు కోసేందుకు ఒక కుటుంబం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

 

మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను అణగదొక్కే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. అలాంటి కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో త్వరలోనే విస్తరణ జరిగే అవకాశం ఉంది.

ANN TOP 10