AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హర్యానాలో స్పందించిన ప్రధాని మోదీ..! ఏమన్నారంటే..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై స్పందించారు. హర్యానాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమై ఉందని విమర్శించారు. ప్రకృతి విధ్వంసం, వన్యప్రాణులకు హాని కలిగించడం కాంగ్రెస్ పాలనలో సాధారణ విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

తెలంగాణ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని దుయ్యబట్టారు.

 

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు మోసపోతున్నారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హర్యానాలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు.

ANN TOP 10