AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ సినిమాల కోసం రాజమౌళి వెయిటింగ్ అంటా..? నిజమేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శక దిగ్గజ ధీరుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రాజమౌళి (Rajamouli ) తీసింది కేవలం కొన్ని సినిమాలే అయినా ఆ సినిమాలన్నింటితో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అతి తక్కువ సమయంలోనే గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకోవడమే కాకుండా తెలుగు సినిమా కోసం ఇప్పుడు ప్రపంచం ఎదురుచూసేలా చేశారు. అంతటి గొప్ప చరిత్ర సృష్టించిన రాజమౌళి ఏదైనా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటే ఆ సినిమా కోసం కేవలం పాన్ ఇండియా ప్రేక్షకులు మాత్రమే కాదు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ రాజమౌళియే కనీ వినీ ఎరుగని రీతిలో ఒక సినిమా కోసం ఎదురుచూస్తున్నారట. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది ..? దీన్ని ఎప్పుడు చూడాలి..? అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆ 3 చిత్రాలు ప్రత్యేకమే..

అందరినీ తన సినిమాలతో వెయిట్ చేయించే రాజమౌళి కూడా ఏకంగా 3 సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి రాజమౌళిని అంతలా వెయిట్ చేస్తున్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ.. నేను ఒక ప్రేక్షకుడిగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) – ఎన్టీఆర్(NTR ) కాంబోలో వస్తున్న సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. అలాగే సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy Vanga)- ప్రభాస్(Prabhas ) కాంబినేషన్లో వచ్చే సినిమా ‘స్పిరిట్’ తో పాటు బుచ్చిబాబు (Bucchibabu sana) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న ‘పెద్ది’ సినిమా కోసం కూడా ఎదురు చూస్తున్నాను అంటూ కామెంట్లు చేశారు రాజమౌళి. మరి రాజమౌళి ఇంత ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా విశేషాలు కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో తొలిసారి సినిమా రాబోతోంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పేరు ప్రచారంలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను ప్రశాంత్ నీల్ మొదలుపెట్టగా మరొకవైపు పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. అంతేకాదు ఇందులో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ (Rukhmini Vasanth)హీరోయిన్ గా నటిస్తోంది. మరి కొన్ని రోజుల్లో అటు ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు.

బుచ్చిబాబు సనా, రామ్ చరణ్ కాంబినేషన్లో పెద్ది అనే టైటిల్ తో సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్ రిలీజ్ చేయగా.. ఇది ఆధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా గ్లింప్ లాస్ట్ లో రామ్ చరణ్ స్టైలిష్ షాట్ అందరిని ఆకట్టుకుంది. ఇందులో రామ్ చరణ్ నిజంగానే లయన్ లా అనిపించాడు.

ఇక మరొక మూవీ సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. 9 నెలలు ఈ సినిమా కోసం ప్రభాస్ డేట్స్ ను సందీప్ అడిగారు. ఇక డేట్స్ ఓకే అయితే త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది. అలా ఈ మూడు చిత్రాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా వీటి కోసం ఎదురుచూస్తున్నారు.

ANN TOP 10