అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం సంభవించడంతో సుమారు 8 మంది కార్మికులు మృతి చెందగా, మరో 8 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక, మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో ముగ్గురిని నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
అయితే, నర్సీపట్నంలో 6 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. ఇక, అనకాపల్లిలో నేడు మరో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం జరగనుంది. బాణాసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనపై కోటవురట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆరు బృందాల ఏర్పాటు చేశారు. పేలుడు సంభవించిన ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తుంది.