విజయ్ దేవరకొండ మూవీ ‘అర్జున్ రెడ్డి’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా షాలినీ పాండే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే షాలిని మంచి గుర్తింపు పొందింది. షాలినీ పాండే స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో రేస్ లో ఆమె వెనుకబడిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీ, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
తాజాగా తనకు ఏ హీరోతో నటించాలని ఉందో షాలినీ పాండే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో కలిసి నటించాలనేది తన కోరిక అని షాలినీ పాండే చెప్పింది. అతని కళ్లలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుందని, నటనలో ఒక మాయ ఉంటుందని తెలిపింది. రణబీర్ తో కలిసి ఒక్క రోజైనా పని చేయాలనేది తన కోరిక అని చెప్పింది. ప్రతి సినిమాలో రణబీర్ నటనలో మార్పు కనిపిస్తుందని కితాబునిచ్చింది.