ఈ నెల 14వ తేదీ నుంచి భూభారతిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో భూభారతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మొదట పైలట్ ప్రాజెక్టుగా భూభారతిని అమలు చేయనున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మూడు మండలాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ప్రజల సలహాలు, సూచనలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూభారతిని రూపొందించినట్లు చెప్పారు. ఈ పోర్టల్‌పై ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, ఈ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించనున్నట్లు తెలిపారు.