AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ లపై త్రిష ఫైర్..! ఎందుకంటే..?

రెండు దశాబ్దాల కెరీర్ అయిపోయిన.. ఇంకా స్టార్ హీరోయిన్‌లుగా చక్రం తిప్పుతున్న అతికొద్ది మందిలో త్రిష ఒకరు. ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోలంతా ఆమెనే బెస్ట్ ఛాయస్‌గా ఫీలవుతున్నారు. ముఖ్యంగా ‘పొన్నియిన్ సెల్వన్’, ‘బీస్ట్’ వచ్చాక త్రిష రేంజ్ మారిపోయింది. ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టగా ఇందులో చిరంజీవి ‘విశ్వంభర’, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, మోహన్ లాల్ ‘రామ్’, సూర్య 45 వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో మూడు దాదాపు పూర్తయిపోగా మిగిలినవి కూడా వేసవిలోగా ఫినిష్ అవుతాయట. అంతే కాదు త్వరలో ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ ప్యాన్ ఇండియా మూవీ చేయనుందట.. ఇలా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియా పై మండిపడింది..

కారణం ఏంటా అనుకుంటున్నారా.. తాజాగా త్రిష ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ మంచి హిట్ అందుకోగా, త్రిష క్యారెక్టర్ల మీద కామెంట్స్ వచ్చాయి. పెద్దగా ప్రాధాన్యం లేకుండా హీరో భార్య గా నటించడం ఏమిటంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.. దీంతో త్రిష.. ‘ కఠినమైన మనసు ఉన్నవాళ్లకు అసలు నిద్ర ఎలా పడుతుందో అర్థం కావడం లేదు. వాళ్ళ జీవితం ఎలా గడుస్తుందో కూడా తెలియట్లేదు. సోషల్ మీడియాలో కూర్చుని ఇతరుల గురించి అర్థం పర్థం లేని స్టఫ్‌ని పంచుకుంటేనే మీకు రోజు గడుస్తుందా..? ఇలాంటి పిరికివాళ్ళు ఉన్నందుకు జాలేస్తుంది. అయినా కూడా మీకు ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ త్రిష గట్టిగా స్పందించింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10