AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆక్వా రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

ఆక్వా రంగంపై ఆధారపడిన లక్షలాది రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల్ని భారీగా పెంచేసిన నేపథ్యంలో ఎగుమతులు జరగక ఇబ్బందులు పడుతున్న వేళ రొయ్యల రైతులు అడిగిన ఓ డిమాండ్ కు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో రాష్ట్రంలో రొయ్యల తయారీ రైతులకు ఊరట దక్కబోతోంది. ఈ మేరకు రొయ్యల మేత తయారీ దారుల నుంచి ప్రకటన వెలువడింది.

 

రాష్ట్రంలో ఓవైపు అమెరికాకు ఎగుమతులు ఆగిపోయి రొయ్యల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయలో రొయ్యల మేత ధర తగ్గించేలా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో రొయ్యల తయారీ దారులతో సమావేసాలు నిర్వహించిన ప్రభుత్వం.. వారిని ధర తగ్గించేందుకు ఒప్పించింది. దీంతో రాష్ట్ర రొయ్యల మేత తయారీదారుల సంఘం అధ్యక్షుడు బీద మస్తాన్ రావు కీలక ప్రకటన చేశారు.

రాష్ట్రంలో రొయ్యల మేత ధరల్ని కిలోకు 4 రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్లు బీద మస్తాన్ రావు ప్రకటన చేశారు. దీంతో రొయ్యల రైతులు ఇకపై కొనుగోలు చేసే మేతపై ఈ మేరకు ధర తగ్గబోతోంది. ప్రస్తుతం ఎగుమతులు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జోక్యంతో రొయ్యల మేత ధర తగ్గడం రైతులకు ఊరటనిస్తోంది. అమెరికాకు ఎగుమతుల విషయంలో ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆలోపు దేశీయంగా ఇతర రాష్ట్రాలకు రొయ్యల ఎగుమతులు చేసుకునేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10